Hindenburg

Hindenburg: హిండెన్‌బ‌ర్గ్ మూసివేత నిర్ణ‌యం.. బెదిరింపులే కార‌ణ‌మా?

Hindenburg: అమెరికాలోని ప్ర‌ముఖ ఇన్వెస్ట్‌మెంట్ ప‌రిశోధ‌నా సంస్థ, షార్ట్ సెల్లింగ్ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించే హిండెన్ బ‌ర్గ్ రీసెర్చ్ సంస్థ మూత‌ప‌డింది. హిండెన్‌బ‌ర్గ్ సంస్థ‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు దాని ఫౌండ‌ర్ అయిన నాథ‌న్ అండ‌ర్స‌న్ జ‌న‌వ‌రి 15న ప్ర‌క‌టించారు. ఈ సంస్థ ఎప్పటి నుంచో త‌న కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తున్నా, ఇటీవ‌లే ఇండియా సంస్థ‌ల‌పై చేసిన స‌ర్వేపై ఆ సంస్థ వార్త‌ల్లో నిలిచింది. వ్యాపార వేత్త గౌత‌మ్ అదానీ సంస్థ అయిన అదానీ గ్రూప్‌పై షార్ట్ సెల్లింగ్ చేయ‌డంతో వార్త‌ల్లోకెక్కింది.

Hindenburg: ప్ర‌పంచవ్యాప్తంగా ప‌లు సంస్థ‌ల కార్య‌క‌లాపాల‌పై ఆర్థిక స‌ర్వేలు నిర్వ‌హించి, వాటి లోటుపాట్ల‌ను వెల్ల‌డి చేయ‌డంతో ఆయా కంపెనీల షేర్లు ప‌డిపోవ‌డం, షార్ట్ సెల్లింగ్ ద్వారా లాభాలు ఆర్జించ‌డ‌మే హిండెన్ బ‌ర్గ్ రీసెర్చ్ సంస్థ ప‌ని. ఈ నేప‌థ్యంలో ఎన్నో ప‌రిశోధ‌న‌ల నివేదిక‌ల‌ను బ‌హిర్గ‌తం చేసింది. దీనినే ఆర్థిక‌రంగంలో మాన‌వ నిర్మిత కృత్రిమ విప‌త్తుల్ని గుర్తించ‌డం అని పేరు పెట్టుకున్న‌ది.

ఇది కూడా చదవండి: Thummala Nageswara Rao: మా ఒత్తిడితోనే బోర్డు వచ్చింది..ఎంపీ అరవింద్ కు తుమ్మల కౌంటర్‌

Hindenburg: ఇలాంటి సంచ‌ల‌న‌మైన హిండెన్‌బ‌ర్గ్ సంస్థ‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు అండ‌ర్స‌న్ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. దీని మూసివేత‌న వెనుక ఎలాంటి కార‌ణాలు లేవ‌ని, వ్య‌క్తిగ‌త అంశాలు, భ‌యాలు, బెదిరింపులు అస‌లే లేవ‌ని ఆయ‌న ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 2017లో ప్రారంభించిన ఈసంస్థ.. పోరాటాలు, విజ‌యాలు, ప్ర‌యాణం గురించి ఎక్స్‌లో భావోద్వేగ‌తంతో పోస్టు చేశారు. మోసం, అవినీతి, దుర్వినియోగం ఇలా అన్నీ బ‌హిర్గ‌తం చేయ‌డంలో హిండెన్‌బ‌ర్గ్ విజ‌య‌వంత‌మైంది. ఎన్నో సామ్రాజ్యాల్ని క‌దిలించాం, వాటిని క‌దిలించాల‌ని మేము ముందే అనుకున్నాం.. వాటిలో ఇండియాకు చెందిన అదానీ గ్రూప్ కూడా ఒక‌టి అని పేర్కొన్నారు.

Hindenburg: ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌భావవంతంగా ప‌నిచేసిన ఈ హిండెన్ బ‌ర్గ్ సంస్థ‌ను ఎవ‌రైనా బెదిరింపుల‌కు దిగ‌డం వ‌ల్లే మూసివేత‌కు కార‌ణ‌మైందా? అన్న అనుమానాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌లుగుతున్నాయి. ప్రపంచ మేటి సంస్థ‌ల కార్య‌క‌లాపాల‌ను క‌దిలించిన ఈ మేటి ప‌రిశోధ‌నా సంస్థ‌ను ఆ లాస్ అయిన సంస్థ‌లే తుడిచిపెట్టేందుకు ముందుకొచ్చాయా? అన్న అనుమానాలు క‌లుగుక‌మాన‌దు. ఏదైతేనేమి కానీ, ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించే ఈ సంస్థ మూసివేత నిర్ణ‌యం షాక్ క‌లిగించింద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *