Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఆదివాసీలు జరుపుకునే జాతరలో ఓ వింతైన ఘటన చోటుచేసుకున్నది. ఇది ఎక్కడా జరగని అరుదైన ఘటనగా చెప్పుకుంటున్నారు. ప్రతి సంక్రాంతి పర్వదినాన ఇలాంటి ఆనవాయితీ తరచూ వస్తున్నదని అక్కడి గిరిజనులు చెప్తున్నారు. ఇంతకీ ఆ జాతరలో ఏం జరిగిందంటే?
Adilabad: ఆదిలాబాద్ జిల్లా నార్నూరులో అక్కడి ఆదివాసీల ఆరాధ్యదైవమైన ఖాందేవుని జాతర ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా జరుపుకుంటారు. ఈ జాతరను తొడసం వంశస్తులు జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్న ఓ ఆచారం ఈ ఏడాది కూడా జరిగింది. జాతర సమయంలో నాగుబాయి చందు అనే మహిళ రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగింది.
Adilabad: ఇది ఎలాంటి ఆచారమో కానీ, ఆ మహిళకు ఏమైనా అనారోగ్యం జరిగితే ఎలా అని కొందరు అంటుండగా, దేవుడి మహిమతో ఏమీ కాదని మరికొందరు వాదిస్తున్నారు. ఆదివాసీ గూడేల్లో ఇలాంటి పురాతన ఆచారాలు ఇంకా కొనసాగుతుండటం గమనార్హం. ఒకవేళ ఆమెకు ఇప్పటికిప్పుడు ఎలాంటి హాని జరగకున్నా దీర్ఘకాలికంగా ఏమైనా అనారోగ్యం జరుగుతుందేమోనని పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.