మంత్రి కొండా సురేఖపై పరువునష్టం ధావకై హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. తమ కుటుంబానికి మంచి పేరు, ప్రతిష్టలున్నాయని తెలిపారు. కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాదకరంగా.. నాగచైతన్య, సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేశారని దాంతో తమ కుటుంబ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లిందని అన్నారు.
మంత్రి చేసిన కామెంట్స్ అసత్య ఆరోపణలు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి కామెంట్స్ చేశారని అన్నారు. ఈ వార్తలు అన్ని చానెళ్లు, పేపర్లలో వచ్చాయని. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.

