Naga Babu

Naga Babu: వైసీపీ తీరుపై నాగబాబు ఫైర్..

Naga Babu: జనసేన నాయకులు, నటుడు నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “హరిహర వీరమల్లు” చిత్రంపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. వైసీపీని, ఆ పార్టీ నాయకులను ఏమనాలో తనకు అర్థం కావడం లేదని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

“ఒక సినిమాను అడ్డుకోవడానికి, దానిపై అనవసరమైన ఆరోపణలు చేయడానికి ప్రయత్నించడం చాలా తప్పు. ‘హరిహర వీరమల్లు’ చిత్రంపై జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా నిరాధారం. సినిమా పరిశ్రమకు ఇలాంటి కుట్రలు ఎంత మాత్రం మంచివి కావు” అని నాగబాబు స్పష్టం చేశారు.

కేవలం సినిమాపైనే కాకుండా, ప్రభుత్వం పైనా వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. “ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అటువంటి ప్రభుత్వ పాలనపై నిత్యం అవాస్తవాలను ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం దురదృష్టకరం” అని నాగబాబు అన్నారు.

ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. “నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎండగట్టాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అనైతిక చర్యలకు తావు లేదు” అని నాగబాబు పిలుపునిచ్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *