Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య తన 25వ చిత్రం కోసం భారీగా సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణతో కలిసి మరో బ్లాక్‌బస్టర్‌ను అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మజిలీ’ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కొత్త చిత్రానికి శివ నిర్వాణ కథను సిద్ధం చేస్తుండగా, చైతన్య ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే అడ్వాన్స్‌లు కూడా చేరాయట.
Also Read: Kajol: రామోజీ ఫిల్మ్ సిటీలో భయానక అనుభవం: కాజోల్ షాకింగ్ కామెంట్స్..!
Naga Chaitanya: శివ నిర్వాణ ప్రస్తుతం ఈ సినిమా కోసం డైలాగ్ వెర్షన్‌ను రూపొందిస్తున్నారు. గతంలో ‘టక్ జగదీష్’, ‘ఖుషి’ చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ, ‘మజిలీ’ విజయంతో శివ మరోసారి చైతన్యతో జతకట్టి హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ చిత్రం ఫీల్‌గుడ్ ఎమోషన్స్, యాక్షన్‌తో ఆకట్టుకునేలా రూపొందనుంది. అన్నీ సవ్యంగా జరిగితే, ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. చైతన్య అభిమానులకు ఈ చిత్రం మరో మజిలీ అనుభవాన్ని అందించనుందని అంటున్నారు.