Nadendla Manohar: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలు ఐదేళ్లకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. “ప్రజలు అభివృద్ధి కోసం ఓటు వేశారు… కానీ జగన్ మాత్రం బటన్‌లు నొక్కే రాజకీయమే చేశాడు” అని ఎద్దేవా చేశారు.
మద్యపాన నిషేధం మాట ఎందుకు నిలబెట్టుకోలేదో?
జగన్ పాలనలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని నాదెండ్ల ప్రశ్నించారు. “మద్యపాన నిషేధం అంటారు… కానీ ఆ హామీ అమలు చేయలేకపోయారు. ప్రజలకు ఇచ్చిన మాటను మరిచిపోయారా?” అని నిలదీశారు.
ఉచిత గ్యాస్ పంపిణీ వివరాలు
ద్వీపం 2 పథకంలో ప్రభుత్వం చేసిన పనులు వివరించిన నాదెండ్ల –
-
మొదటి విడతలో 97 లక్షల మందికి గ్యాస్ పంపిణీ చేసి రూ.846 కోట్లు ఖర్చు చేశామని,
-
రెండో విడతలో 91.10 లక్షల మందికి రూ.712 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
రైతులపై జగన్ పాలన వైఫల్యం
రైతుల కోసం జగన్ పెద్దగా ఏమీ చేయలేదని, బకాయిలు కూడా చెల్లించకుండా వెళ్లిపోయారని ఆరోపించారు.
“రైతుల పట్ల ప్రేమ ఉందని చెప్పే జగన్… రూ.1600 కోట్ల బకాయిలు ఎగ్గొట్టి ఎలా వెళ్లిపోయారు? ధాన్యం రైతులకు నరకం చూపించారు. గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు” అని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: India vs NATO: భారత్కి వార్నింగ్ ఇచ్చిన నాటో చీఫ్.. ఎందుకంటే..?
రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదు
నాదెండ్ల మాట్లాడుతూ.. మేం వచ్చాక పంటకాల్వలు బాగు చేశాం.
-
7.7 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగేలా చర్యలు తీసుకున్నాం.
-
జగన్ పాలనలో బడారైతులు, వ్యాపారులకే లాభం జరిగింది అని అన్నారు.
సమాజంలో చిచ్చు పెట్టేందుకు జగన్ ప్రయత్నం
జగన్ పర్యటనల పేరుతో రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని, “వర్క్ ఫ్రమ్ బెంగళూరు చేస్తూ నెలకోసారి వచ్చి అల్లర్లు చేస్తారు” అని నాదెండ్ల విమర్శించారు.
ప్రజలే తీర్పు చెప్పారు
జగన్ పాలనను ప్రజలు తిరస్కరించారని నాదెండ్ల వ్యాఖ్యానించారు. “ప్రజలు తీర్పు చెప్పారు… అందుకే జగన్ పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారు” అని ఎద్దేవా చేశారు.