Nabha Natesh: తెలుగు చిత్రసీమలో ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన నభా నటేష్, స్టార్ హీరోయిన్‌గా ఎదిగే సూచనలు కనిపించాయి. అయితే, ఊహించని విధంగా వరుస ఓటములతో ఆమె టాలీవుడ్‌కు కాస్త దూరమైంది. ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో తన సత్తా చాటుతూ, మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
సినిమాల్లో నిమగ్నమైనప్పటికీ, తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఇన్స్టాలో ఆమె మరోసారి తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసింది. ఆకర్షణీయమైన లుక్‌తో, గ్లామరస్ ఫోటో షూట్తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Nabha Natesh: ఆమె తాజా హాట్ ఫొటోలు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ” అబ్బా.. నభా అందాలు అదిరిపోయాయి” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కన్నడ సినిమాల్లో కొత్త ఒరవడితో ముందుకు సాగుతున్న నభా, తెలుగు సినిమాల్లో మళ్లీ రాణిస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఆమె కెరీర్‌లో ఈ కొత్త అధ్యాయం ఎలాంటి ఫలితాలను తెస్తుందో చూడాలి.