Murder Case: ఆస్తి కోసం బంధాలనే మరుస్తున్నారు.. ఎంతటి దారుణాలకైనా వెనుకాడటం లేదు.. నిండు జీవితాలనే బలి తీసుకుంటున్నారు.. ఇక్కడా అదే ఘటన చోటుచేసుకున్నది. సవతి తల్లి పోరు అంతింత కాదయా.. అని మన కథల్లో, గతంలోని జీవితాల్లో విన్నాం.. కానీ, ఇక్కడ జరిగిన ఘటన ఆ సవతి తల్లి ఓ యువతిని ఘోరంగా చంపింది. ఎవరికీ తెలియకుండా ఏకంగా నదిలో పాతిపెట్టింది. ఘోరమైన ఈ ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు నివ్వెరపోయేలా ఉన్నాయి.
Murder Case: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌కు చెందిన పీనానాయక్‌కు 30 ఏండ్ల క్రితం వివాహం కాగా, ఒక కూతురు, ఒక కుమారుడు కలిగారు. 2003లో తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి కూతురు మహేశ్వరి హీనానాయక్ వద్దే పెరిగింది. అదే ఏడాది పీనానాయక్ లలిత అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈమెకు ఒక కూతురు కలిగింది.
Murder Case: మొదటి భార్య కూతురైన మహేశ్వరి బీఎస్సీ నర్సింగ్ చేసి, ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నది. ఉద్యోగం చేసే చోట పరిచయం అయిన ఓ యువకుడిని మహేశ్వరి పెళ్లి చేసుకోగా, కొంతకాలానికి వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కూతురు మహేశ్వరికి భారీగా కట్నకానుకలు ఇచ్చి రెండో వివాహం జరపాలని అనుకున్నాడు. ఇక్కడే అసలు చిక్కొచ్చిపడింది.
Murder Case: బోడుప్పల్‌లో తనకున్న రెండు ఇండ్లలో ఒకటి మహేశ్వరికి ఇచ్చి పెళ్లి చేయాలని భావించాడు. దీంతో ఆస్తి పోతుందని మహేశ్వర సవతి తల్లి లలిత భావించింది. ఎలాగైనా సవతి కూతురును కడతేర్చితే ఆ ఆస్తి కూడా తనకే దక్కుతుందని అనుకున్నది. మహేశ్వరిని చంపేందుకు నిశ్చయించుకున్నది. ఆనవాళ్లు దొరకకుండా చేయాలని ప్రణాళిక వేసింది.
Murder Case: పీనానాయక్ రెండో భార్య లలిత తన మరిది అయిన సీఆర్పీఎఫ్ జవాన్ బానోత్ రవి, అతని స్నేహితుడు వీరన్న కలిసి మహేశ్వరిని చంపే పథకం వేశారు. గతేడాది డిసెంబర్ 7న ఉద్యోగ పనులపై పీనానాయక్ బయటకు వెళ్లిన సమయం చూసిన ఈ ముగ్గురు మహేశ్వరిని ఇంటిలోనే ఘోరంగా చంపేశారు. ఆ తర్వాత నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి వద్ద మూసీ నదిలో పూడ్చి పెట్టారు.
Murder Case: పీనానాయక్ తిరిగి ఇంటికి రాగానే కూతరు వేరే వ్యక్తితో వెళ్లిందని, ఈ విషయం బయటకు చెప్తే పరువు పోతుందని భార్య లలిత అతడిని నమ్మించి నాటకమాడింది. దీంతో మౌనంగా ఉన్న పీనానాయక్ నాలుగు నెలలవుతున్నా కూతూరు జాడ తెలియకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో అసలు విషయాలు బహిర్గతమయ్యాయి. ఆస్తికోసం మహేశ్వరిని చంపినట్టు అంగీకరించగా, ఆ ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు, రిమాండ్‌కు తరలించారు.