Mumbai: లవ్ జిహాదీపై ఆ రాష్ట్రం కీలక నిర్ణయం..

Mumbai: మన దేశంలో పలు ప్రాంతాల్లో లవ్ జిహాద్ ఘటనలు సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ ముస్లింనే, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించుకుంది.

లవ్ జిహాద్‌పై సమగ్రంగా అధ్యయనం చేసి చట్ట ప్రణాళిక రూపొందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం డీజీపీ సంజయ్ వర్మ నేతృత్వంలో ఏడు మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మహిళా శిశు సంక్షేమం, మైనార్టీ వ్యవహారాలు, సామాజిక న్యాయం, న్యాయ వ్యవస్థ, హోం శాఖలకు చెందిన అధికారులు ఉంటారు.

ఈ కమిటీ ఇప్పటికే అమలులో ఉన్న చట్టాలను పరిశీలించి, ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేసి లవ్ జిహాద్ మరియు బలవంతపు మత మార్పిడులను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తుంది. అనంతరం, ఈ చట్టంపై తమ సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంది.

ఇప్పటికే గుజరాత్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు లవ్ జిహాద్ నిరోధక చట్టాలను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర కూడా ఈ జాబితాలో చేరేందుకు సిద్ధమవుతోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *