MIW Vs GGTW

MIW Vs GGTW: బోణీ కొట్టిన ముంబై.. 5 వికెట్లతో సూపర్ విక్టరీ..! ఘోరంగా విఫలమైన గుజరాత్

MIW Vs GGTW: ముంబై ఇండియన్స్, డబ్ల్యూపిఎల్ 2025 సీజన్‌ను ఓటమితో ప్రారంభించినప్పటికీ, గుజరాత్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా వెస్టిండీస్ ప్లేయర్ హైలీ మాథ్యూస్ బంటితోనూ, బ్యాట్ తోనూ విశేషంగా రాణించింది. అటు వైపు గుజరాత్ జట్టు బ్యాటింగ్ లో విఫలమై టోర్నమెంట్ లో తమ రెండవ ఓటమి మూటగట్టుకుంది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 120 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. హర్లీన్ డియోల్ 31 బంతుల్లో 4 ఫోర్లతో 32 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలవగా… కేశ్వీ గౌతమ్ 15 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 20 పరుగులు చేసింది.

అయితే, మిగతా బ్యాటర్లు బ్యాటింగ్‌లో సమష్టిగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో హీలీ మాథ్యూస్ 3 మూడు వికెట్లు తీసింది. ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ నాట్ సీవర్ బ్రంట్, అమెలియా కేర్ చెరో రెండు వికెట్లు తీశారు. షబ్నిమ్ ఇస్మాయిల్ మరియు అమన్‌జోత్ కౌర్ ఒక్కో వికెట్ తీశారు. ముంబై బౌలర్లు ఇన్నింగ్స్ ఆద్యంతం ఎంతో కట్టుదిట్టమైన బంతులు వేయడంతో… గుజరాత్ అతి స్వల్ప స్కోరుకే 10 వికెట్లను కోల్పోయింది.

ఇది కూడా చదవండి: IND vs PAK: భారత జట్టు జెర్సీలపై పాకిస్థాన్‌ పేరు..

ఇక స్వల్ప లక్ష్య చేధన బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ టార్గెట్‌ను 16.1 ఓవర్లలోనే 5 వికెట్ల కోల్పోయి 122 పరుగులతో సాధించి, సులభంగా విజయం పొందింది. నాట్ సివర్ బ్రంట్ 39 బంతుల్లో 11 ఫోర్లతో 57 పరుగులు చేసి అర్ధశతకంతో రెచ్చిపోగా… అమెలియా కేర్ 19 పరుగులు చేసింది. అయితే గుజరాత్ మాత్రం రెండవ ఇన్నింగ్స్ మొదటిలో మంచి పోరాటపటిమ కనబరిచింది పవర్ ప్లే లో వారు వరుసగా వికెట్లు తీస్తూ ఉన్నారు.

అయితే సాధించాల్సిన స్కోర్ చాలా తక్కువ కావడంతో ముంబై ఎలాంటి తడబాటుకు లోను కాలేదు. గుజరాత్ బౌలర్లలో ప్రియా మిశ్రా మరియు కేశ్వీ గౌతమ్ ఇద్దరూ రెండు వికెట్లు తీశారు. తనూజ కన్వార్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో తమ మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *