Mrunal Thakur: సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమా నుంచి విడుదలైన ‘పో పో’ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గురు రంధావా గాత్రంతో, తనీష్క్ బాగ్చీ సంగీతంలో రూపొందిన ఈ గీతం, అజయ్ దేవగన్ ఐకానిక్ స్టైల్‌ను మరోసారి ఆవిష్కరించింది. మృణాళ్ ఠాకూర్ తన డ్యాన్స్‌తో అభిమానులను ఫిదా చేస్తూ, రవి కిషన్‌తో కలిసి స్క్రీన్‌ను లైవ్‌లీగా మార్చింది. 2012లో వచ్చిన ఒరిజినల్ ‘పో పో’ పాటకు ఈ రీమిక్స్ వెర్షన్ మరింత జోష్‌ను జోడించింది. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ ఈ పాటకు వైబ్రంట్ ఎనర్జీని తెచ్చింది.
Also Read: Nidhi Agarwal: అందాల నిధి అగర్వాల్ మాటలకు పవన్ ఫ్యాన్స్ ఫిదా!
విజయ్ కుమార్ అరోరా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కామెడీ, యాక్షన్, డ్రామాతో పాటు పంజాబీ స్వాగ్‌ను అందిస్తుంది. చంకీ పాండే, దీపక్ డోబ్రియాల్, సంజయ్ మిశ్రాలతో కూడిన ఈ సినిమా జులై 25న థియేటర్లలో సందడి చేయనుంది. ముఖ్యంగా మృణాళ్ ఠాకూర్ ఈ పాటలో తన గ్లామర్, ఎనర్జీతో అందరినీ ఆకర్షిస్తోంది. ఆమె అందానికి కుర్రాళ్ళు మత్తులు పోగొట్టుకొని, పిచ్చ ఫిదా అవుతున్నారు.మొత్తానికి మృనాల్ మరోసారి ఇంటర్నెట్ ని షేక్ చేసేస్తుంది.