ఎలా జరిగింది?
పాట్నాలోని ఒక చిన్న ఇంట్లో కూర్చొని, పలు కంపెనీల వెబ్‌సైట్లను హ్యాక్ చేసి, సినిమాలను హెచ్డీ ఫార్మాట్‌లో డౌన్లోడ్ చేసిన అశ్వనీకుమార్, వాటిని ఒక్కొక్కటి సుమారు 800 డాలర్లకు అమ్ముతూ, మొత్తం లక్ష యూఎస్ డాలర్లకు పైరసీ ద్వారా సంపాదించాడు. అతడి నైపుణ్యం అంతే కాక, డిజిటల్ మీడియా సర్వర్స్ మొత్తం హ్యాక్ చేయగల సామర్థ్యం అతనికి ఉంది.
హిట్ సినిమాలను టార్గెట్
తెలుగు సహా పలు భాషల సంక్రాంతి, థండేల్, గేమ్ చేంజర్ వంటి మూవీలను రిలీజ్ కు 18 గంటల ముందే హెచ్డీ ప్రింట్ గా విడుదల చేసి, 4RABET సంస్థకు అమ్మాడు.
ఇది కూడా చదవండి: GV Prakash: విడాకులు తీసుకున్న జీవీ ప్రకాష్, సైంధవి
ప్రభుత్వ వెబ్‌సైట్ల హ్యాకింగ్
అశ్వనీకుమార్ కేవలం సినిమా పరిశ్రమకే పరిమితం కాకుండా, ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్, భారత ప్రభుత్వంలోని పలు వెబ్‌సైట్లు కూడా హ్యాక్ చేసి, ఉద్యోగుల వ్యక్తిగత డేటా, జీతాల వివరాలు సేకరించినట్టు పోలీసులు గుర్తించారు.
అరెస్ట్ కధ
పైరసీ కేసులో మొదట జానా కిరణ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతని క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ ద్వారా అశ్వనీకుమార్ ను గుర్తించారు. 22 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, పోలీసుల రాకను గమనించడమే కాక, ఫోన్లో డేటా, హార్డ్ డిస్క్ డేటా కూడా డిలీట్ చేసిన అతడిని చివరకు పోలీసులు పట్టుకున్నారు.
క్రైమ్ సినిమాను తలపించేలా సినిమా పైరసీ
హ్యాకింగ్ చేసి సినిమా విడుదలకు ముందే ఏకంగా హై డెఫనిషన్ సినిమాలు డౌన్లోడ్ చేసి ఇండస్ట్రీని వణికించిన 22 ఏళ్ల బీహార్ యువకుడి కథ
కిక్ సినిమా తరహాలో విడుదలకు అందరికంటే ముందు సినిమా చూడాలని హ్యాకింగ్ చేసి సినిమా డౌన్లోడ్ చేసి చూసి క్రమక్రమంగా… https://t.co/L4vvAjZn4R pic.twitter.com/0kObCcxVZG
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2025