Mouni Roy: బాలీవుడ్ నటి మౌని రాయ్ తన లేటెస్ట్ బీచ్ వెకేషన్ ఫోటోలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోల్లో ఆమె రంగురంగుల బికినీల్లో అద్భుతంగా కనిపిస్తోంది. సముద్ర తీరంలో, పూల్ సైడ్‌లో ఆమె ఇచ్చిన స్టైలిష్ పోజులు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. ఆమె స్నేహితురాలు, నటి దిశా పటానీ “హాటీ” అంటూ కామెంట్ చేయగా, ఫ్యాన్స్ కూడా “గార్జియస్”, “స్టన్నింగ్” అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. మొత్తానికి మౌని తన ఫిట్నెస్, గ్లామరస్ లుక్‌తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
Also Read: Janhvi Kapoor: జాన్వీ కపూర్ మిడీ ఖరీదు రూ.3.9 లక్షలు
ఈ ఫోటోలను “బెడ్‌పై ఉన్నా, మనసు మాత్రం ఐలాండ్‌లో ఉంది ” అనే క్యాప్షన్‌తో మౌని పోస్ట్ చేసింది. గతంలో ఆమె బికినీ లుక్‌లను సినిమాల్లో చూపించనని, కేవలం వెకేషన్ల కోసమే అని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె మధుర్ భండార్కర్ దర్శకత్వంలో “ది వైవ్స్” సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. మౌని రాయ్ ఈ బీచ్ ఫోటోలతో మరోసారి తన గ్లామర్ మ్యాజిక్ ఏంటో చూపించింది.