Most Popular Film Stars

Most Popular Film Stars: భారత సినిమా స్టార్స్ టాప్ లిస్ట్! నెంబర్ 1 ఎవరు?

Most Popular Film Stars: భారత సినిమా ప్రపంచంలో స్టార్డమ్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ జూన్ 2025 రిపోర్ట్ ప్రకారం, ప్రభాస్ మరోసారి టాప్ స్థానంలో నిలిచారు. బాహుబలి, కల్కి 2898 ఏడీ వంటి బ్లాక్‌బస్టర్‌లతో ప్రభాస్ పాన్-ఇండియా స్టార్‌గా ఆకర్షిస్తున్నారు. రెండో స్థానంలో తమిళ సూపర్‌స్టార్ విజయ్, ఆ తర్వాత అల్లు అర్జున్ ఉన్నారు. బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ నాలుగో స్థానంలో నిలవగా, అజిత్ కుమార్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అక్షయ్ కుమార్, నాని టాప్-10లో చోటు దక్కించుకున్నారు. అయితే సౌత్ సినిమా హీరోలు పాన్-ఇండియా ఫిల్మ్‌లతో దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చెయ్యకుండా ఈ లిస్ట్ లో ఉండటం మాములు విషయం కాదు. చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. దీంతో మహేష్ క్రేజ్ ఏంటో మరోసారి నిరూపితమైంది. మొత్తానికి ఈ లిస్ట్‌లో సౌత్ స్టార్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *