Montha Cyclone: ఉత్తర హిందూ మహాసముద్రం అంటే అరేబియా, బంగాళా ఖాతం వస్తుంది. ఈ ప్రాంతంలో వచ్చే తుఫానులకు పేర్లను పెట్టే అంతర్జాతీయ పద్ధతిలో ఒక భాగం ఉంటుంది. వివిధ దేశాలు అక్షర క్రమంగా ఆయా కాలాల్లో వచ్చే తుఫానులకు పేర్లను అందిస్తాయి. తాజాగా ఈ ప్రాంతాన్ని ఈసారి మొంథా తుఫాన్ భయపెడుతున్నది. దీనిని ఓ దేశం సూచించింది. అదే ఖరారయ్యింది.
Montha Cyclone: వాస్తవంగా ఈ ప్రాంతంలో తుఫానులకు పేర్లు పెట్టేందుకు ఒక అంతర్జాతీయ ప్యానెల్ ఉంది. ఇందులో భారతదేశం, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, థాయ్‌లాండ్, శ్రీలంక, మాల్డీవులు, బంగ్లాదేశ్ వంటి తదితర దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అక్షర క్రమంలో ప్రతి దేశం ఒక తుఫానుకు పేరును సూచిస్తుంది. అది ఆ ప్రాంతీయ పదమైనా అయి ఉండొచ్చు. మొంథా అనేది కూడా అలాగే వచ్చింది.
Montha Cyclone: ప్రస్తుతం మన వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వణికిస్తున్న తుఫాన్‌కు మొంథా పేరును థాయ్‌లాండ్ దేశం సూచించింది. మొంథా అంటే అందమైన పువ్వు లేదా సువాసన గల పువ్వు అని ఆ దేశంలో అర్థం. ఉష్ణమండల తుఫానులకు పేరు పెట్టడానికి ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క వ్యవస్థలో భాగంగా దీనిని ఎంపిక చేశారు.

