Mohan Babu

Mohan Babu: నానికి విలన్ గా మోహన్ బాబు.. ఇక యుద్ధం స్టార్ట్..!

Mohan Babu: నాని అన్నగానే ముందుగా గుర్తుకు వచ్చేది పక్కింటి అబ్బాయి నేచురల్ స్టార్ అని. కానీ కొంత కాలంగా తాను చేస్తున్న సినిమాలు కమిట్ అయిన సినిమాల లిస్ట్ చూస్తుంటే. నాని లవర్ బాయ్ నుండి మాస్ స్టార్ గా ఎదగాలి అని అన్నుకుంటునటు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మొదటి మెట్టుగా దసరా సినిమా చేశాడు తర్వాత హిట్: ది థర్డ్ కేస్ తో తన మార్కెట్ పెంచుకున్నాడు. మధ్యలో హాయ్ నాన్న  వచ్చిన అది ఫాదర్ డౌథెర్ మధ్య నడిచే కథ వచ్చి హిట్ సాధించింది. ఇపుడు మల్లి శ్రీకాంత్ ఓదెలతో ఇంకో సినిమా చేస్తున్న విషయం  తెలిసిందే. ఈ సినిమా నుండి ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటికి వచ్చింది.

నాని తన కెరీర్‌లోనే అత్యంత భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ది ప్యారడైజ్పై దృష్టి సారించారు.ఈ సినిమాలోని క్యారెక్టర్ కోసం తన బాడీని కూడా బిల్డ్ చేశాడు. ఇందులో సిక్స్ ప్యాక్ తో కనిపించిన ఆచార్య పోవాల్సిన అవసరంలేదు. అలంటి క్యారెక్టర్ కి విలన్ గా నటించాలి అంటే అటువైపు కూడా గొప్ప నటుడే ఉండాలి. అందుకని ఆ క్యారెక్టర్ కోసం మోహన్ బాబు ని తీసుకుంటు తెలుస్తుంది.

తాజాగా నటి మంచు లక్ష్మి  ఈ విషయాన్ని బయటపెట్టారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – “ఇది అధికారికంగా బయటకు వచ్చిందో లేదో తెలియదు. కానీ నేను చెప్పేస్తాను. మా నాన్నగారు (మోహన్ బాబు) కూడా ‘ది ప్యారడైజ్’లో కీలక పాత్ర చేస్తున్నారు. ఆ పాత్ర కోసం ఆయన ఈ వయసులోనూ కష్టపడుతున్నారు. ప్రతి సినిమాను తన మొదటి సినిమాలా ట్రీట్ చేయడం ఆయన గొప్పతనం. ఆయన లుక్ కోసం ఎంత కష్టపడుతున్నారో చూసి నేనెంతో ఇన్‌స్పైర్ అయ్యాను” అని తెలిపారు.

ఇది కూడా చదవండి: Gold Rate Today: చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ధరలు ఇవే!

ఈ అప్డేట్‌తో టాలీవుడ్‌లో హల్‌చల్ మొదలైంది. ఇంత వరకు రహస్యంగా ఉంచిన ఈ వార్త బయటకు రావడంతో నాని అభిమానులు, మోహన్ బాబు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నిండిపోయింది. స్క్రీన్‌పై నాని – మోహన్ బాబు కాంబినేషన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలనే  ఆసక్తిగా ఎదురు చుస్తునారు అభిమానులు.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, యాక్షన్, ఎమోషన్, విజువల్ గ్రాండియర్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు ఓ విభిన్న అనుభూతి ఇవ్వబోతుందని మేకర్స్ చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో *‘ది ప్యారడైజ్’*ను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. రిలీజ్ డేట్‌ను ఇప్పటికే ఫిక్స్ చేశారు. 2026 మార్చి 26న ఈ చిత్రాన్ని గ్లోబల్ లెవెల్‌లో విడుదల చేయనున్నారు. ఇప్పటి నుంచే ఈ సినిమా బిజినెస్ రికార్డులు సెట్ చేస్తోందని ఫిల్మ్ నగర్ టాక్.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *