Mohammed Shami: పేసర్ మహ్మద్ షమీ టెస్టుల్లో పునరాగమనం మరింత ఆలస్యం కానుంది. రంజీ ట్రోఫీలో భాగంగా కర్ణాటక, మద్యప్రదేశ్తో జరిగే మ్యాచులకు ప్రకటించిన బెంగాల్ జట్టులో షమీ లేడు. తన ఫిట్ నెస్ నిరూపించుకునేందుకు తొలుత షమీ కర్ణాటకతో మ్యాచ్ ఆడాలని షమీ భావించాడు. అదే లక్ష్యంగా నెట్స్ లో సాధన షురూ చేశాడు. తన ప్రాక్టీసుపై పూర్తిగా సంతృప్తి చెందినట్లు ప్రకటించాడు కూడా. కానీ బెంగాల్ సెలెక్టర్లు అతన్ని జట్టుకు ఎంపిక చేయలేదు. నవంబర్ 13న ఇండోర్ లో ఆరంభమయ్యే మధ్యప్రదేశ్ మ్యాచ్ కూ అతన్ని ఎంపిక చేయకపోవడంతో ఇప్పట్లో షమీ టెస్టు పునరాగమనం సాధ్యపడదేమో. ఈ మేటి పేసర్ అందుబాటులో లేని కారణంగా టీమిండియా బ్యాలెన్స్ కోల్పోతోంది. అందులోనూ షమీ వికెట్ తీసే పేసర్ కావడంతో వాల్డ్ క్రికెట్లో టీమిండియా కష్టాలు పెరిగాయి.
