MLA Raja Singh: రాఖీ పర్వదినాన గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సోదర, సోదరీమణులకు పవిత్ర రాఖీ పండుగనాడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి, అతనికి దీర్ఘాయుష్షును కోరుకుంటుందని తెలిపారు. ప్రతి సోదరుడు తన సోదరిని రక్షించుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడని చెప్పారు.
MLA Raja Singh: కానీ, ఈ రక్షాబంధన్ నాడు రాష్ట్రంలోని నా సోదరీమణుల నుంచి నాకు ఒక ప్రత్యేక బహుమతి కావాలి.. అని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరుకున్నారు. వారిని కోరేది ఒక్కటే.. సోదరీమణులారా.. లవ్ జిహాద్ లాంటి కుట్రలకు మీరు బలైపోమని ప్రతిజ్ఞ చేయండి.. అని ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం (ఆగస్టు 9) తన సోషల్ మీడియా వేదికపై పోస్టుల్లో కోరుకున్నారు.