MLA Padi Koushik Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై కౌశిక్‌రెడ్డి స్పందించారు. గ్రూప్ 1 పరీక్షల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ ఇప్పటికే గతంలో పాడి కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
MLA Padi Koushik Reddy: తాజాగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోనే తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో అతి పెద్ద స్కాం జరిగిందని పాడి కౌశిక్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఒక వరుసలో హాల్ టికెట్ నంబర్ ఉండే 654 మందికి ఒకటే మార్కులు వచ్చాయని ఆరోపించారు. ఇంకో వరుసలో హాల్ టికెట్ నంబర్ ఉండే 702 మంది అభ్యర్థులకు ఒకటే మార్కులు వచ్చాయని ఆరోపించారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
MLA Padi Koushik Reddy: గ్రూప్ పరీక్షల నిర్వహణపై సీఎం రేవంత్‌రెడ్డిపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు తెలంగాణ యువతపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే గ్రూప్ 1 పరీక్షల స్కాంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలని కోరారు. పరీక్షల్లో అక్రమాలు జరిగాయని హైకోర్టే చెప్పిందని కౌశిక్‌రెడ్డి చెప్పారు.

