Indian Railways: లడఖ్‌లో చైనాతో ఉద్రిక్తత తగ్గుముఖం పడుతూ వస్తోంది. అయితే భారతదేశం భవిష్యత్తు కోసం వ్యూహాత్మక ఏర్పాట్లు చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో, త్వరలో ఉత్తరాఖండ్‌లోని చైనా సరిహద్దు వరకు భారతీయ రైల్వేలను నడపడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీనికోసం చంపావత్ జిల్లాలోని తనక్‌పూర్ నుండి బాగేశ్వర్ మధ్య రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. 169 కిలోమీటర్ల మేర ఈ రైలు మార్గానికి సంబంధించిన సర్వే పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ రైలు మార్గము ఎత్తైన హిమాలయ పర్వతాల మీదుగా వెళుతుంది. చైనా సరిహద్దు వెంబడి పితోర్‌ఘర్ మీదుగా బాగేశ్వర్ చేరుకుంటుంది.
ఇది కూడా చదవండి: AAP First List: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్
కొత్త రైల్వే లైన్ వ్యూహాత్మకంగా ముఖ్యమైనదని రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రాజేంద్ర సింగ్ చెబుతున్నారు. పితోర్‌ఘర్ జిల్లా నేపాల్ మరియు చైనాతో అంతర్జాతీయ సరిహద్దుకు అనుసంధానించి ఉంది. తనక్‌పూర్ భారతదేశం-నేపాల్ సరిహద్దులో ఉన్న ప్రాంతం. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లోని నేపాల్ సరిహద్దులో భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్ కూడా అని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ మార్గంలో సర్వేతోపాటు పిల్లర్ల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి.