Opal Suchata Chuangsri: హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయిలాండ్‌కు చెందిన ఓపాల్ సుచట గెలుచుకుంది. ఇథియోపియాకు చెందిన హస్సెట్ డెరెజె మొదటి రన్నరప్‌గా, పోలాండ్‌కు చెందిన మజా క్లాజ్డా రెండో రన్నరప్‌గా నిలిచారు. విజేతకు ఒక మిలియన్ డాలర్లు లేదా దాదాపు 8 కోట్ల రూపాయల విలువైన వజ్ర కిరీటం లభించింది. భారతదేశానికి చెందిన నందిని గుప్తా టాప్ 20లో చోటు దక్కించుకున్నట్లు సమాచారం.
విశేషమేమిటంటే ఓపాల్ సుచట క్యాన్సర్ నుంచి బయటపడింది. అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో ఈ అందాల రాణి మాట్లాడుతూ ప్రపంచ వేదికపై ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలో థాయిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు సంతోషంగా ఉందని అన్నారు. ఊహించని విధంగా, మిస్ థాయిలాండ్ మిస్ వరల్డ్ వేదికకు సిద్ధం కావడానికి కేవలం 15 రోజులు మాత్రమే పట్టింది.
ఇది నా జీవితంలో జరిగిన ఒక అద్భుతం. ఇంత తక్కువ సమయంలో ఈ అవకాశం లభించడం నా అదృష్టం, థాయ్ ప్రజలు, అంతర్జాతీయ అభిమానుల ప్రోత్సాహానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఈ వేదికపై విజయం సాధించడం నా దేశానికి నా బహుమతి. ఓపాల్ సుచట థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో పుట్టి పెరిగారు. ఆమె విద్యాభ్యాసం అక్కడే జరిగింది. ఉన్నత చదువుల కోసం బ్యాంకాక్ వెళ్లారు. అక్కడే ఆమె ఫ్యాషన్ ప్రయాణం మొదలైంది. తనకు 16 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్ సర్జరీ జరిగింది. ఇందులో భాగంగా, క్యాన్సర్ కాని కణితిని తొలగించారు. కాగా మెక్సికో నగరంలో జరిగిన అంతర్జాతీయ మిస్ యూనివర్స్ 2024 పోటీలో ఒపాల్ థాయిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించి, మూడవ రన్నరప్‌గా నిలిచింది.
ఇది కూడా చదవండి: Panchayat Elections: త్వరలో మోగనున్న పంచాయతీ ఎన్నికల నగరా! కొద్ది రోజుల తేడాతో ఇతర స్థానిక ఎన్నికలు!!