RC16 Update: రామ్ చరణ్, బుచ్చిబాబు సన కలయికలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ మైసూరు పరిసరాల్లో జరుగుతోంది. ఈ మూవీ సెట్ లోకి మీర్జాపూర్ వెబ్ సీరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ అడుగు పెట్టాడు. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలు తెలియచేస్తూ అతనికి వెల్ కమ్ చెప్పేశారు. అమెజాన్ ప్రైమ్ లో రెండు సీజన్స్ గా వచ్చి సూపర్ హిట్ అయిన ‘మీర్జాపూర్’ సీరీస్ లీడింగ్ యాక్టర్స్ లో దివ్యేందు శర్మ ఒకరు. ఇక ఈ సీరీస్ లో పూల్ చంద్ త్రిపాఠీగా గ్యాంగ్ స్టర్ పాత్రను పోషించాడు దివ్యేందు శర్మ. 17 ఏళ్ళ క్రింత బాలీవుడ్ లో అడుగుపెట్టిన దివ్యేందుకి ‘మీర్జాపూర్’ బంపర్ బ్రేక్ ఇచ్చింది. దాంతో ఏకంగా టాలీవుడ్ లో రామ్ చరణ్ సినిమలో ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పుడు ఈ సినిమా నుంచి తన లుక్ ని రిలీజ్ చేశారు. వృద్ధి సినిమాస్ పతాకంపై కిలారు వెంకట సతీశ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ భాగస్వాములు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరో్యిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది చివరలో ఈ సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమాకు దివ్యేందు పాత్ర ఏ మేరకు హెల్ప్ అవుతుందో చూడాలి.
