Mirai Box Office Collections

Mirai Box Office Collections: దుమ్ము దులుపుతున్న మిరాయ్.. 5 డేస్ లో 100 క్రోర్స్

Mirai Box Office Collections: తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ‘ఈగల్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ పాన్‌ఇండియా చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కథ పై నమ్మకంతో హీరోల మార్కెట్, డైరెక్టర్ గత రికార్డులు పట్టించుకోకుండా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం, ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టింది. విడుదలైన ఐదు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద ₹100 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది.

వరల్డ్‌వైడ్ వసూళ్లు

మిరాయ్ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ₹27.20 కోట్లు రాబట్టగా, రెండో రోజు ₹28.40 కోట్లు, మూడో రోజు ₹25.60 కోట్లు వసూలు చేసింది. నాలుగో రోజు సోమవారం కొంత తగ్గి ₹10.25 కోట్లు, ఐదో రోజు ₹8 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో మొత్తం ఐదు రోజుల్లోనే ₹100.40 కోట్ల గ్రాస్ సాధించింది.

ఇదే సమయంలో ఓవర్సీస్‌లోనూ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో $2 మిలియన్ కలెక్షన్లు సాధించి, తేజ సజ్జా బ్యాక్ టూ బ్యాక్ రెండు $2 మిలియన్ డాలర్ మూవీస్ కలిగిన హీరోగా అరుదైన రికార్డు అందుకున్నాడు.

ఇది కూడా చదవండి: Chhattisgarh: బిగ్ షాక్.. ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 12 మంది మావోయిస్టుల

విజయోత్సవాలు – అభిమానులకు కృతజ్ఞతలు

ఈ అద్భుత విజయంపై హీరోలు తేజ సజ్జా, మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా విజయవాడలో జరిగిన సక్సెస్ మీట్‌లో పాల్గొన్న తేజ, “ఈ విజయంతో మరింత బాధ్యత పెరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ సినిమా అందుబాటులో ఉండాలి అన్ని  టికెట్ ధరలు కూడా పెంచలేదు” అని తెలిపారు.

సీక్వెల్ టాక్ – నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘మిరాయ్ 2’ కోసం కొన్ని ఐడియాలు రెడీగా ఉన్నాయని తెలిపారు. మొదటి పార్ట్‌లో వాడలేకపోయిన నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్‌ను సీక్వెల్‌లో వినియోగిస్తామని వెల్లడించారు.

మొత్తం మీద, ‘హనుమాన్’ తర్వాత ‘మిరాయ్’తోనూ 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా తన కెరీర్‌లో వరుస రేర్ ఫీట్ సాధించాడు. ఇక సీక్వెల్ ఎప్పుడు అనౌన్స్ అవుతుందనే ఆసక్తి ఫ్యాన్స్‌లో మొదలైంది.మిరాయ్ పార్ట్ 2 స్క్రిప్ట్ రెడీ కావడానికి టైం పట్టడంతో గతంలో వచ్చి మంచి విజయం సాధించిన జాంబీ రెడ్డి కి సీక్వెల్ లో నటించనున్నారు. ఈ సినిమా తో ఇంటర్నేషనల్ లో అడుగుపెట్టనున్నారు తేజ సజ్జ.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *