Earthquake

Earthquake: విశాఖలో స్వల్ప భూకంపం

Earthquake: విశాఖపట్నం, ఈ రోజు తెల్లవారుజామున విశాఖపట్నం నగరంలో స్వల్ప భూకంపం సంభవించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల 18 నిమిషాల నుంచి 4 గంటల 24 నిమిషాల మధ్య పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.

భూమి వణికిన అనుభూతి కలగడంతో నగరంలోని అనేక ప్రాంతాల ప్రజలు భయంతో తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముఖ్యంగా మురళీనగర్, గాజువాక, మాధురవాడ, ఎం.వి.పి. కాలనీ, గోపాలపట్నం వంటి నివాస ప్రాంతాలతో పాటు ఆరిలోవ, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్‌బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలి, పెందుర్తి ప్రాంతాల్లోనూ ప్రకంపనలు స్పష్టంగా నమోదయ్యాయి. భీమిలి బీచ్ రోడ్డు ప్రాంతంలో ఈ ప్రకంపనలు పెద్ద శబ్దంతో వచ్చాయని స్థానికులు తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలం వద్ద కూడా స్వల్పంగా భూమి కంపించింది.

Also Read: Chandrababu Naidu: సీఎం చంద్రబాబు లండన్ పర్యటన.. ఏపీకి భారీ పెట్టుబడులు

భూకంప తీవ్రతపై అధికారులు ప్రాథమిక పరిశీలన చేపట్టారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) నుంచి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉన్నప్పటికీ, దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.0 నుంచి 3.7 మధ్యగా నమోదైనట్టు అంచనా వేస్తున్నారు. భూకంపం తక్కువ తీవ్రతతో సంభవించడం వల్ల, ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయాందోళనలు చెందకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *