Nara Lokesh: ఏపీలో కొనసాగుతున్న 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు. డిఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేష్ ఈరోజు జరిగిన ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.వచ్చే ఏడాది విద్య ప్రారంభమైన నెలలోగా డిఎస్సీ నియామకాలు పూర్తి చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకున్నట్టు సభలో ప్రకటించారు. గత ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు అని లోకేష్ అన్నారు. మేం వచ్చాక మెగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీఎస్సీ నిర్వహిస్తాం. టీచర్ల సమస్యలపై చిత్తశుద్ధితో పని చేస్తాం. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌లో టీచర్లను భాగస్వాముల్ని చేస్తాం. టీచర్లపై గత ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేస్తాం అన్నారు.