CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనముల రేవంత్‌రెడ్డి మరోసారి మహారాష్ట్రకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇప్పటికే రెండుసార్లు వెళ్లి ప్రచారంలో పాల్గొని వచ్చిన ఆయన తాజాగా శుక్రవారం రాత్రికి బయలుదేరి వెళ్లనున్నట్టు సమాచారం. లేకుంటే శనివారం ఉదయం అయినా వెళ్తారని తెలిసింది. ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో వరుసగా మూడు రోజుల పాటు పాల్గొంటారని విశ్వసనీయ సమాచారం.