అమెరికాను వణికిస్తున్న మిల్ట‌న్ హ‌రికేన్

అమెరికాలోని అనేక ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు అక్కడి అధికారులు.మిల్ట‌న్ హ‌రికేన్ తీవ్ర తుఫాన్‌గా మారి ఫ్లోరిడా రాష్ట్రం వైపు దూసుకొస్తున్న‌ది.

ప్ర‌స్తుతం అయిదో కేట‌గిరీ తుఫాన్‌గా మిల్ట‌న్ హ‌రికేన్‌ను ప్ర‌క‌టించారు. మిల్ట‌న్ వ‌ల్ల గంట‌కు సుమారు 165 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. బుధ‌వారం రాత్రి అత్యంత శ‌క్తివంతంగా ఆ గాలులు తీరాన్ని చేరే అవ‌కాశాలు ఉన్నాయి.

ఫ్లోరిడాలోని లోత‌ట్టు ప్రాంత ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్ర‌దేశాల‌కు చేరుకోవాల‌ని అధ్య‌క్షుడు బైడెన్ కోరారు. ఫ్లోరిడాలో డ‌జ‌న్ల సంఖ్య‌లో షెల్ట‌ర్ల‌ను త‌యారు చేసిన‌ట్లు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ రాన్ డీసాంటిస్ తెలిపారు. ఇప్ప‌టికే పెట్రోల్ స్టేష‌న్ల‌లో భారీ క్యూలైన్ల‌ను ఏర్పాటు చేశారు. మిల్ట‌న్ హ‌రికేన్ నేప‌థ్యంలో.. దేశాధ్య‌క్షుడు బైడెన్ విదేశీ టూర్‌ను ర‌ద్దు చేసుకున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Betting Apps Case: బెట్టింగ్‌యాప్ కేసులో కీల‌క ప‌రిణామం.. టాలీవుడ్ టాప్ స్టార్ల‌పై ఫిర్యాదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *