Satya Nadella: టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తూ, అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం భారీగా పెరిగింది. కృత్రిమ మేధస్సు (AI) రంగంలో కంపెనీని ముందంజలో నిలిపినందుకు గుర్తింపుగా, ఆయనకు ఈ ప్రోత్సాహం లభించింది.
2025 ఆర్థిక సంవత్సరానికి గాను సత్య నాదెళ్ల ఏకంగా 96.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 847.31 కోట్లు) వేతనం అందుకోనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆయన అందుకున్న 79.1 మిలియన్ డాలర్ల (రూ. 664 కోట్లు) జీతంతో పోలిస్తే ఇది ఏకంగా 22 శాతం ఎక్కువ. మైక్రోసాఫ్ట్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
AI పురోగతే కారణం మైక్రోసాఫ్ట్‌ను ‘ఈ తరానికి చెందిన సాంకేతిక మార్పులో (AI) స్పష్టమైన అగ్రగామిగా’ నిలపడంలో సత్య నాదెళ్ల మరియు ఆయన నాయకత్వ బృందం కృషి ఎంతో ఉందని కంపెనీ బోర్డు పేర్కొంది. జూన్‌లో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వృద్ధిలో దూసుకుపోవడంతో పాటు, కంపెనీ షేర్లు దాదాపు 23 శాతం లాభపడటం కూడా ఈ జీతాల పెంపునకు ప్రధాన కారణం.
Also Read: Trump Tariffs: ఫలించిన వాణిజ్య చర్చలు..50% నుండి 15% తగ్గనున్న సుంకాలు
వేతనంలో కీలక అంశాలు నాదెళ్ల మొత్తం వేతనంలో దాదాపు 90 శాతం వాటా కంపెనీ షేర్లు, ఇతర ప్రోత్సాహకాల రూపంలో ఉంది. ఆయన ప్రాథమిక జీతం 2.5 మిలియన్ డాలర్లు కాగా, అదనంగా 9.5 మిలియన్ డాలర్ల (రూ. 80 కోట్లు) నగదు ప్రోత్సాహకం కూడా ఆయనకు అందనుంది. బాధ్యతలు చేపట్టిన దశాబ్ద కాలంలో నాదెళ్ల అందుకుంటున్న అత్యధిక జీతం ఇదే.
తెలుగు తేజం నేపథ్యం 1967లో హైదరాబాద్‌లో జన్మించిన సత్య నాదెళ్ల, ఐఏఎస్ అధికారి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ కుమారుడు. ఆయన మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ పట్టా పొందారు. 1992లో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగంలో చేరిన ఆయన, అంచెలంచెలుగా ఎదిగి 2014లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. నేడు టెక్ ప్రపంచంలో AI రేపుతున్న సంచలనం ఆయనకు ఒక గొప్ప అవకాశంగా మారింది.