Fire Accident

Fire Accident: షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం.. 5 మందికి తీవ్ర గాయాలు

Fire Accident: కాన్పూర్ నగరంలోని చమన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గాంధీనగర్ ప్రాంతాన్ని ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం కుదిపేసింది. ఒక ఆరు అంతస్తుల భవనంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమవ్వగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

అధికారుల ప్రకారం, మంటలు మొదట భవనంలోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగాయి. అదే భవనంలో నివసిస్తున్న ఓ కుటుంబం — దంపతులు మరియు వారి ముగ్గురు కుమార్తెలు — మూడవ మరియు నాల్గవ అంతస్తుల్లో చిక్కుకున్నారు. మూడవ అంతస్తులో రెండు మృతదేహాలు గుర్తించినట్లు సెంట్రల్ డీసీపీ దినేష్ త్రిపాఠి వెల్లడించారు.

వెంటనే సమాచారం అందుకున్న SDRF (State Disaster Response Force) సిబ్బంది, అగ్నిమాపక దళాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పదిమంది అగ్నిమాపక సిబ్బంది, 12 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించి తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. లోపల చిక్కుకున్న ఐదుగురిని బయటకు తీసుకొచ్చి, తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ భవనంలో అక్రమంగా షూ తయారీ యూనిట్ కూడా నడుస్తున్నట్లు అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. మంటలు చెలరేగిన సమయంలో భవనం పూర్తిగా జనాలతో నిండిఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు పరిసర భవనాలను ఖాళీ చేయించి, మరో పెద్ద ప్రమాదాన్ని నివారించారు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు తెలియచేసేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

WordsCharactersReading time

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  NEET PG Results 2025: వైద్య విద్యార్థులకు శుభవార్త! విడుదలైన NEET PG 2025 ఫలితాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *