Massive encounter: ఢిల్లీ నగరంలో బుధవారం అర్ధరాత్రి దాటాక భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. వారంతా మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్స్ అని, వారిలో ఒకడు అత్యంత కరుడుగట్టిన నేరస్థుడని తేలింది. గురువారం తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో బీహార్, క్రైంబ్రాంచి పోలీసులు పాల్గొన్నారు.
Massive encounter: ఢిల్లీ నగరంలోని రోహిణి ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో బీహార్, ఢిల్లీకి చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. హతుల్లో కరుడుగట్టిన నేరస్తుడైన గ్యాంగ్ లీడర్ రంజన్‌పాఠక్ (25), భీమ్లేష్ మహ్‌తో (25), మనీశ్ పాఠక్ (33), అమన్ ఠాగూర్ (21) ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బీహార్ రాష్ట్రంలో నమోదైన వివిధ కేసుల్లో వీరంతా పరారీలో ఉన్నారు. వీరిలో అమర్ ఠాకూర్ ఢిల్లీలోని కరావాల్ నగర్‌కు చెందిన వాడు కాగా, మిగతా ముగ్గురూ బీహార్‌లోని సీతామర్హికి చెందినవారుగా పోలీసులు తెలిపారు.
Massive encounter: బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈ నలుగురు పెద్ద కుట్రలకు ప్లాన్ చేసినట్టు వార్తలు అందాయి. సిగ్మా కంపెనీ పేరుతో ఈ నలుగురు తమ అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే వీరు ఢిల్లీలో సంచరిస్తున్నట్టు వార్తలు అందడంతో బీహార్ పోలీసులు క్రైమ్ బ్రాంచి పోలీసులతో సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ నలుగురు హతమయ్యారు.