Mass Jatara: మాస్ రాజా రవితేజ లేటెస్ట్ ఫిల్మ్ ‘మాస్ జాతర’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఇప్పటికే హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా తర్వాత రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడు. ఈ కొత్త చిత్రం షూటింగ్ జూన్‌లో మొదలు కానుంది.
ఈ మూవీలో హీరోయిన్గా కేతిక శర్మ ఇప్పటికే ఫైనల్ అయింది. అయితే, ఇప్పుడు మరో ట్విస్ట్ ఏంటంటే.. రెండో హీరోయిన్గా ‘నా సామిరంగ’ ఫేమ్ ఆషికా రంగనాథ్ ఎంట్రీ ఇస్తోందని టాక్.
Also Read: Kingdom: ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ రగడ, ఫేక్ న్యూస్‌కు చెక్?
Mass Jatara: ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, రవితేజతో రొమాన్స్‌కు సిద్ధమవుతోంది. ఆషికా ఈ చిత్రంలో ఎలాంటి రోల్లో కనిపించనుంది అనేది ఆసక్తి రేపుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ త్వరలో వస్తుందని సమాచారం. రవితేజ మాస్ ఎంటర్టైన్మెంట్తో మరో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

