Marri Rajasekhar

Marri Rajasekhar: జగన్‌కు భారీ షాక్.. టీడీపీలో చేరనున్న మర్రి రాజశేఖర్‌

Marri Rajasekhar: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా చిలకలూరిపేటకు చెందిన కీలక నాయకుడు మర్రి రాజశేఖర్ వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరేందుకు సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం అమరావతిలో సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ చేరనున్నారు. రాజశేఖర్‌తో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా టీడీపీ కండువా కప్పుకోనున్నారు.

ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన రాజశేఖర్ ఈ పరిణామాలతో సత్తా చాటారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ఘన విజయం సాధించగా, వైసీపీ కేవలం 11 స్థానాలలోని తెలిచింది. ఎలక్షన్ లో  ఘోర పరాజయం చవిచూసింది. ఓటమి తర్వాత జగన్‌ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవ్వడంతో పలువురు కీలక నేతలు వైసీపీకి రాజీనామా చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Rain Alert: రానున్న నాలుగు రోజులు ఏపీలో పిడుగులతో వర్షాలు!

ఆ జాబితాలో తాజాగా మర్రి రాజశేఖర్ చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన టీడీపీలో చేరికతో చిలకలూరిపేట ప్రాంతంలో పసుపు జెండా బలపడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో జగన్‌ నాయకత్వంపై వైసీపీ లోపల ఉన్న అసంతృప్తి మరోసారి బయటపడినట్టైంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *