Maoist: మావోయిస్టులు మరోసారి సంచలన ప్రకటన విడుదల చేశారు. కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ చేసిన స్టేట్‌మెంట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మార్చి నెల నుంచి శాంతి చర్చలు జరగాలని నిరంతరం ప్రతిపాదనలు చేస్తున్నామని, కానీ ఆ ప్రతిపాదనలకు అనుగుణంగా చర్యలు జరుగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మావోయిస్టులు ఆపరేషన్ కాగర్ నిలిపివేసి, శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాలని కోరారు. ఇంతలోనే కేంద్ర, రాష్ట్ర కమిటీల్లోని కొంతమంది సభ్యులు అనారోగ్య సమస్యల కారణంగా లొంగిపోతున్నారని కూడా పేర్కొన్నారు.
శాంతి చర్చలపై అభిప్రాయాలు తెలపడానికి మెయిల్ అడ్రెస్‌ను ప్రకటించడం పూర్తిగా అర్థరహితమని మావోయిస్టులు అభిప్రాయపడ్డారు. ఈ విధమైన ప్రకటనలు పార్టీ అనుమతి లేకుండా వెలువడకూడదని, ఎవరైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు సమాఖ్య అనుమతి తీసుకోవాలని సూచించారు.