Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటు కోసం రంగం సిద్ధం అవుతుంది. అయితే, మహాయుతి కూటమి నుంచి సీఎం అభ్యర్థి ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు.
నవంబర్ 26వ తేదీతో అసెంబ్లీ పదవీకాలం ముగియనుండడంతో ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇది జరగకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంటుంది. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే,అజిత్ పవార్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి ప్రభుత్వ అధినేత అంటే ముఖ్యమంత్రి పేరును నిర్ణయించనున్నారు. ఈరోజు బీజేపీ హైకమాండ్‌తో భేటీ తర్వాత సీఎం పేరు ప్రకటించవచ్చు.
ఇది కూడా చదవండి: Parliament Winter Session: నేటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు..
1 ముఖ్యమంత్రి, 2 డిప్యూటీ సీఎంల ఫార్ములా ఖరారైనట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రతి 6-7 మంది ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అనే ఫార్ములా కూడా మహాయుతి పార్టీల్లో ఖరారైంది. దీని ప్రకారం బీజేపీకి చెందిన 22-24 మంది ఎమ్మెల్యేలు, షిండే గ్రూపులో 10-12 మంది, అజిత్ గ్రూపులో 8-10 మంది ఎమ్మెల్యేలు మంత్రులు కావచ్చు.
సీఎం పేరు ప్రకటించిన తర్వాత ఈరోజు సాయంత్రం ముంబైలోని రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఎక్కువ సీట్లు వచ్చిన వారే సీఎం అవుతారని ఎన్నికలకు ముందు నిర్ణయించుకోలేదని విజయం తర్వాత సీఎం షిండే అన్నారు.