Manipur: మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. విష్ణుపూర్ ప్రాంతంలో అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గత ఏడాదిన్నరగా మైతేయి–కుకీ తెగల మధ్య కొనసాగుతున్న ఘర్షణలతో మణిపూర్‌లో శాంతి భద్రతా పరిస్థితులు దెబ్బతింటూనే ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని అల్లర్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఇంటిపైనా గతంలో దాడి ప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే. వరుస గృహదహనాలు, ఆస్తుల ధ్వంసం రాష్ట్రాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చాయి.
కర్ఫ్యూ కొనసాగుతున్నప్పటికీ దాడులు ఆగడం లేదు. ఇటీవల కొంత శాంతి నెలకొన్నట్లు కనిపించినా, మణిపూర్‌లో మళ్లీ హింస అగ్గిరాజేసింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే మణిపూర్ పర్యటన చేసిన విషయం గుర్తుంచుకోవాలి.