Bhairavam: శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భైరవం’. జయంతిలాల్ గడ సమర్పణలో కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. మూవీ టైటిల్ తో పాటు సినిమాలో నటించిన వారి లుక్స్ ను రిలీజ్ చేస్తూ వస్తోంది యూనిట్. అందులో భాగంగా తాజాగా మంచు మనోజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో గజపతిగా కీలక పాత్ర పోషిస్తున్నాడు మనోజ్. భారీ వర్షం బ్యాక్ డ్రాప్ లో ఆవేశంగా నడుచుకుంటూ వస్తున్న మనోజ్ లుక్ ఆకట్టుకుంటోంది.
ఇది కూడా చదవండి: Singh Is Kinng: ‘సింగ్ ఈజ్ కింగ్’ సీక్వెల్… హీరో అక్షయ్ కాదు!
Bhairavam: నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లుక్స్ ఇప్పటికే విడుదల అయ్యాయి. ఇందులో ప్రియమణి కీలక పాత్రలో కనపించనున్నారు. తమిళ చిత్రం ‘గరుడన్’కి రీమేక్ గా వస్తున్న ‘భైరవం’కు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలన్నది దర్శకనిర్మాతల ప్లాన్. మరి ‘భైరవం’ ముగ్గుల పండగ పోరులో నిలుస్తుందో లేదో తెలియాంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే!
Presenting the Rocking Star @HeroManoj1 as 𝐆𝐀𝐉𝐀𝐏𝐀𝐓𝐇𝐈 from the massy world of #Bhairavam 💥🔱 pic.twitter.com/wLCoZKD6LV
— BA Raju’s Team (@baraju_SuperHit) November 12, 2024