Singh Is Kinng: 16 ఏళ్ళ క్రితం వచ్చిన అక్షయ్ కుమార్ ‘సింగ్ ఈజ్ కింగ్’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ మూవీని విపుల్ అమృత్ లాల్ సాహా నిర్మించారు. 30 కోట్లతో తెరకెక్కి 130 కోట్లకు పైగా వసూళ్ళను సాధించిన ఈ చిత్రం కు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. రీమేక్ హక్కులను శైలేంద్ర సింగ్ తీసుకున్నారు. ఈ సీక్వెలో హీరోగా రణ్ వీర్ సింగ్ కోసం ట్రై చేస్తున్నారు. తను ఒప్పుకోకుంటే దల్జీత్ సింగ్ ని తీసుకుంటాం తప్ప అక్షయ్ కుమార్ ని మాత్రం తీసుకోనని తెగేసి చెబుతున్నాడు నిర్మాత. దర్శకుడుగా మత్రం అనీస్ బజ్మీనే కొనసాగిస్తాడట. స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైన ఈ సీక్వెల్ కు ‘షేర్ కింగ్’, ‘కింగ్-2’, ‘సింగ్ ఈజ్ కింగ్ రిటర్న్స్’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. 12 సంవత్సరాలనుంచి రీమేక్ రైట్స్ కోసం ట్రై చేసి ఎట్టకేలకు సాధించాడు శైలేంద్ర సింగ్. అక్షయ్ సినిమాలు వరుసగా నిరాశపరుస్తున్న నేపథ్యంలోనే తనతో ఈ సీక్వెల్ తీయనని చెబుతున్నాడు శైలేంద్ర. అయితే అక్షయ్ మాత్రం ఖాళీగా ఏం లేడు. దాదాపు పది చిత్రాలతో బిజగా ఉన్నాడు. మరి అక్షయ్ ని కాదని వేరే హీరోతో వెళుతున్న శైలేంద్ర సింగ్ ఈ సీక్వెల్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
