Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని నాగ్‌మార్గ్ ప్రాంతంలో మంగళవారం నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఇద్దరు ఉగ్రవాదులు దాగి ఉన్నట్టు సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉత్తర కశ్మీర్‌లో గత 7 రోజుల్లో ఇది ఐదో ఎన్‌కౌంటర్. గతంలో బందిపోరా, కుప్వారా, సోపోర్‌లలో ఎన్‌కౌంటర్‌లు జరిగాయి.
అంతకుముందు నవంబర్ 10న కిష్త్వార్‌లోని కేష్వాన్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇక్కడ 3-4 మంది ఉగ్రవాదులు దాక్కున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో సైన్యం సెర్చ్ మొదలు పెట్టింది. అప్పుడు ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈ సందర్భంగా 4 పారా స్పెషల్ ఫోర్స్ సైనికులు గాయపడ్డారు. చికిత్స పొందుతూ నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్ మృతి చెందాడు. మూడో రోజు కూడా ఇక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Prayagraj: ప్రయాగరాజ్ యుపిపిఎస్‌సి ముందు వేలది మంది విద్యార్థుల నిరసన
Jammu Kashmir: గత 2 రోజుల్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య 3 ఎన్‌కౌంటర్లు జరిగాయి. నవంబర్ 10 రోజుల్లో 8 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. సోపోర్‌లో నవంబర్ 8న ఇద్దరు ఉగ్రవాదులు, నవంబర్ 9న ఒక ఉగ్రవాది హతమయ్యారు. ఈ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి.