Manchu manoj: మంచు కుటుంబం మధ్య వివాదం మరింత గందరగోళంగా మారింది. మంచు మనోజ్ తాజా ఆరోపణలతో ఈ వివాదం మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయింది. మంచు విష్ణు, తన ఇంటి వద్ద జనరేటర్‌లో పంచదార పోయించి విద్యుత్ సరఫరాను నిలిపివేయించారని మనోజ్ ఆరోపించారు.
మంచు మనోజ్ ప్రకటనలో, ఆయన సినిమా షూటింగ్‌కు వెళ్లిన సమయంలో, విష్ణు తన అనుచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయ్ రెడ్డిలతో పాటు కొంతమంది బౌన్సర్‌లను తీసుకొని ఇంట్లోకి ప్రవేశించి ఈ పని చేశారని చెప్పారు. జనరేటర్ ఆపడం వల్ల రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తన కుటుంబం తీవ్ర అసౌకర్యానికి గురైందని తెలిపారు.
ఇందులో ఉన్న గ్యాస్ కనెక్షన్, వాహనాలు, ఇతర ప్రమాదకర వస్తువుల గురించి కూడా మనోజ్ పేర్కొన్నారు. ఈ చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.