Odisha: ఒడిశాలోని కేంద్రపరాలో మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో జిల్లా కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ 53 ఏళ్ల నిందితుడు బాధితురాలి పొరుగున నివసించేవాడు. పోలీసులు అతడిని కోర్టు నుండే అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. జిల్లా కోర్టులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనోజ్ కుమార్ సాహు ఈ సమాచారాన్ని అందించారు. పోక్సో కోర్టులో అదనపు జిల్లా జడ్జి-కమ్-స్పెషల్ జడ్జి సమక్షంలో కేసు విచారణ జరిగిందని ఆయన చెప్పారు.
ఈ కేసులో అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించి శిక్షను ప్రకటించింది. ఈ కేసులో పోలీసులు నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీటును సమర్పించారు. అనంతరం కోర్టులో సంబంధిత ఆధారాలను పరిశీలించి 19 మంది సాక్షుల వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఈ సమయంలో నిందితుడికి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు, సాక్షుల వాంగ్మూలాలు లభించాయి. దీని తర్వాత, జరిగిన విచారణలో కోర్టు ఈ ఘటనను చాలా తీవ్రమైనది.. అదేవిధంగా సిగ్గుచేటు వ్యవహారంగా పేర్కొంది. తరువాత నిందితునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Narendra Modi: నైజీరియా నుంచి బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీ
ఈ కేసులో దోషికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు నిందితుడు కపిలేంద్ర మాలిక్‌కు రూ.50 వేలు జరిమానా కూడా విధించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు జూన్ 6, 2022 న ఈ సంఘటనకు పాల్పడ్డాడు. ఆ సమయంలో బాధితురాలు తన స్నేహితుడిని కలిసేందుకు నిందితుడి ఇంటికి వచ్చింది. ఈ సమయంలో నిందితుడు బాధితురాలిని మోసం చేసి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు.


