Telangana

Telangana: నారాయణపురంలో వ్యక్తి దారుణ హత్య

Telangana: దుండుగల చేతిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని నారాయణపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కాకునూరి కొండయ్య గ్రామంలో ఇంటి వద్దనే ఉంటున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు మద్యం మత్తులో ఆటోలో వచ్చి ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి చేశారు. దీంతో కొండయ్య కేకలు వేయడంతో స్థానికులు రావడంతో దుండగలు పరారయ్యారు.

తీవ్ర గాయాలతో పడి ఉన్న కొండయ్య కేకలు వేయడంతో స్థానికులు ఇంట్లోకి ప్రవేశించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన కొండయ్యను చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి కొండయ్యను తరలించగా అప్పటికే మృతిచెందాడు. ఈ విషయమై గ్రామంలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసిన దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు. దాడికి గల కారణాలు ఏమిటనే కోణంలో విచారణ చేపట్టారు.

కొండయ్య హత్యతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విషయం తెలుసుకున్న రూరల్‌ సీఐ వీరబాబు పోలీసు సిబ్బందితో గ్రామానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. కొండయ్య హత్య వెనుక భూతగాదాలు ఉన్నట్లుగా స్థానికంగా చర్చ జరుగుతోంది. కొండయ్య భార్య యాదమ్మ సుమారు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చెందింది. అప్పటి నుంచి కొండయ్య ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు.

కొండయ్యకు ముగ్గురు కుమారులు ఉన్నారు. తన ఆరు ఎకరాల స్థిరాస్తిని కుమారులు సేద్యం చేసుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కొండయ్య మృతి వెనుక బలమైన కారణాలు ఏమిటన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. దుండగులు ఎక్కడి నుంచి వచ్చారన్న అంశంపై విచారణ చేపడుతున్నారు. గతంలో ఉన్న తగాదాలను పోలీసులు గుర్తించి హత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

హత్యకు పాల్పడి ఆటోలో పరారీ అయిన దుండుగల్లో ఇద్దరిని మండలంలోని ధర్మాపురం వద్ద పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఈ సంఘటనపై కుటుంబసభ్యులెవరూ బుధవారం రాత్రి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయనట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం హత్యకు దారితీసిన కారణాలను పోలీసులు వెల్లడించనున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *