Viral News

Viral News: ఏందిరా అయ్యా ఇది.. మనిషిని చూసి పారిపోయిన సింహం

Viral News: నువ్వు ఏదో ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తున్నావ్ అనుకో సడన్ గా  సింహం లేదా పులి ఎదురుపడితే.. మనిషి ప్రాణభయంతో పరుగులు తీయడం సహజం. కానీ జునాగఢ్‌లో జరిగిన ఒక విచిత్ర ఘటనలో మాత్రం పరిస్థితి తారుమారైంది. ఇక్కడ సింహం, మనిషి ఇద్దరూ ఒకరినొకరు చూసి ఒకేసారి భయపడి పరుగులు పెట్టేశారు.

రిటైర్డ్‌ ఐఎఫ్ఎస్‌ అధికారి సుశాంత్‌ నంద తన ఎక్స్‌ ఖాతాలో ఈ అరుదైన సంఘటన వీడియోను షేర్‌ చేశారు. వీడియోలో, ఒక వైపు సింహం, మరో వైపు మనిషి నడుస్తూ వస్తున్నారు. మధ్యలో ఒక చిన్న భవనం అడ్డుగా ఉంది. ఇద్దరూ దానిని దాటి ఎదురుపడగానే ఒక్కసారిగా షాక్‌ అయ్యి, భయంతో విరుద్ధ దిశల్లో పరిగెత్తిపోయారు.

ఇది కూడా చదవండి: Seethakka: ఓట్లు దొంగిలించి బీజేపీ అధికారంలోకి వచ్చింది 

ఈ ఘటన జునాగఢ్‌లోని ఓ సిమెంట్‌ ఫ్యాక్టరీ సమీపంలో జరిగింది. అక్కడి సీసీటీవీ కెమెరాలో ఇది రికార్డు అయ్యింది. సింహం ఎందుకు భయపడిందన్న ప్రశ్న అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిపుణుల మాటల్లో, ప్రశాంతంగా నడుస్తూ వెళ్తున్న సింహం ముందు అకస్మాత్తుగా మనిషి ప్రత్యక్షమవ్వడం ‘ఎలిమెంట్ ఆఫ్ సర్‌ప్రైజ్‌’ వల్ల అయి ఉండొచ్చని చెబుతున్నారు.

జీవితంలో సింహం మనిషిని వెంబడించడం సహజం, కానీ మనిషిని చూసి సింహం పరారయ్యే ఈ రివర్స్‌ చేజ్‌ మాత్రం చాలా అరుదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి.. 300 కుపైగా విమానాలు ఆలస్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *