Makara Sankranti Brahmotsavam: నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల ఘనంగా ముగిశాయి చివరి రోజు భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునస్వామి అశ్వవాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు,వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో అశ్వ వాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నులపండువగా ఆలయ ప్రదక్షిణలు గావించారు ఈ పూజ కైకర్యాలలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు,అధికారులు, పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Health Tips: బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి తాగితే.. గుండె జబ్బులు మాయం!
Makara Sankranti Brahmotsavam: ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలల్లో చివరిరోజులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం జరిపించబడింది ఈ పుష్పోత్సవంలో శ్రీ స్వామి అమ్మవార్లకు సుమారు 20 రకాల పుష్పాలు,మూడు రకాల పత్రాలతో స్వామి అమ్మవార్లను విశేషంగా అర్పించి 11 రకాల ఫలాలు నివేదించి తరువాత శ్రీ స్వామి అమ్మవార్లకు ఏకాంతసేవ నిర్వహించి శయనోత్సవం జరిపించారు ఈ శయనోత్సవానికిగాను ఆలయ ప్రాంగణములోని శ్రీస్వామి అమ్మవార్ల శయనమందిరానికి విశేషపుష్పాలంకరణ చేసి ఏకాంతసేవ నిర్వహించారు ఈ పూజకైకార్యలలో ఆలయ ఈవో శ్రీనివాసరావు,అధికారులు, భక్తులు పాల్గొన్నారు నేటితో శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.
Beta feature