Hyderabad: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మణికొండలోని పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోల్డెన్ ఒరియల్ అపార్టుమెంటులో ఉన్న ఓ ఫ్లాట్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.మంటలు భారీగా ఎగసిపడటంతో భయాందోళనలకు గురైన ఫ్లాట్‌లో ఉంటున్న ఫ్యామిలీతో పాటు అపార్ట్మెంట్ వాసులు బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్‌ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. అప్పటికే ఫ్లాట్ పూర్తిగా దగ్ధమైంది. డబ్బులు, బట్టలు, విలువైన సామాగ్రి కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం సంభించినట్లు బాధితులు వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.