Hyderabad: వామ్మో .. కొండాపూర్ అపార్ట్మెంట్ గ్యాస్ పేలుడు..

Hyderabad: హైద‌రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొండాపూర్‌లో మంగ‌ళ‌వారం సాయంత్రం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. గ్యాస్ సిలిండర్ పేలి రాజ‌రాజేశ్వ‌రీ కాల‌నీ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని 9వ అంత‌స్తులో ఉన్న ఫ్లాట్‌లో మంట‌లు చెల‌రేగాయి. ప్ర‌మాద స‌మ‌యంలో ఫ్లాట్‌లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ముప్పు త‌ప్పింది. స్థానికులు వెంటనే ఫైల్ పోలీసులకు సమాచారం అందించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌టనాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. అయితే గ్యాస్ సిలిండ‌ర్ పేలుడు కార‌ణంగా అగ్నిప్ర‌మాదం జ‌రిగి ఉండొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *