Mufasa: వాల్ డిస్నీ వారి ‘ముఫాసా: ద లయన్ కింగ్’ కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేశ్ ఈ సినిమా కోసం తన డబ్బింగ్ పూర్తి చేశాడు. బారీ జెనిక్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషాల్లో రిలీజ్ కాబోతోంది. దీపావళికి మహేశ్ వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇక డిసెంబర్ 7న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ స్థాయిలో నిర్వహించనుంది డిస్నీ కంపెనీ. ఇక పుంబ పాత్రకు బ్రహ్మానందం, టైమన్ క్యారక్టర్ కు ఆలీ వాయిస్ ఇవ్వగా సింబా పాత్రకు సత్యదేవ్ వాయిస్ ఇవ్వనున్నారు. హిందీలో ముఫాసా పాత్రకు షారూఖ్ ఖాన్, సింబా పాత్రకు ఆయన తనయుడు ఆర్యన్ ఖాన్, యంగ్ ముఫాసా పాత్రకు ఎబిరామ్ వాయి ఇవ్వటం విశేషం. మరి మహేశ్ వాయిస్ తో రాబోతున్న ‘ముఫాసా: ద లయన్ కింగ్’ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూద్దాం.

