Lucky Baskhar: తొలి చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో మీనాక్షి చౌదరి ప్రతిభ ఉన్న నటిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఎందుకో ఏమో రావలసినంత పేరు మాత్రం రాలేదు. మహేశ్ బాబు ‘గుంటూరు కారం’లో నటించినా, తమిళంలో విజయ్ ‘గోట్’లో ప్రధాన లీడ్ చేసినా, అంతకు ముందు విజయ్ ఆంటోని సినిమా చేసినా ఏవీ తన కెరీర్ ను మలుపు తిప్పలేక పోయాయి. ప్రస్తుతం మీనాక్షి మూడు వరుస సినిమాలతో రాబోతోంది. ముందుగా ఈ నెల 31న దీపావళి కానుకగా రాబోతున్న ‘లక్కీ భాస్కర్’ తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని దృఢంగా నమ్ముతోంది మీనాక్షి. ఆ తర్వాత విశ్వక్ సేన్ తో ‘మెకానిక్ రాకీ’, ఆ వెంటనే వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమాలు రాబోతున్నాయి. ఇవే కాకుండా మెగాస్టార్ ‘విశ్వంభర’లోనూ మీనాక్షి భాగం అయినట్లు వినికిడి. ఏదేమైనా ‘లక్కీ భాస్కర్’తో లక్ కలసి వస్తుందని నమ్ముతున్న మీనాక్షి ఆశ నెరవేరాలని ఆశిద్దాం…
