mahesh babu

Mahesh Babu: ముఫాసాపై మహేష్ బాబు ప్రశంసలు

Mahesh Babu: ‘ది లయన్ కింగ్’కు ప్రీక్వెల్ గా రూపుదిద్దుకున్న సినిమా ‘ముఫాసా: ది లయన్ కింగ్’. మొదటి సినిమా 2019లో విడుదలై ఘన విజయం సాధించగా, ఇప్పుడీ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కాబోతోంది. ఈ లైవ్ యాక్షన్ మూవీని బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేశారు. ఇంగ్లీష్ తో పాటు హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ఇది జనం ముందుకు రాబోతోంది. తెలుగులో ముఫాసా పాత్రకు వాయిస్ ఇవ్వడం పట్ల సూపర్ స్టార్ మహేశ్ బాబు హర్షం వ్యక్తం చేశారు.
Mahesh Babu: ఇప్పటి వరకూ వచ్చిన పాపులర్ పాత్రల్లో ముఫాసా కూడా ఒకటి అని, కుటుంబానికి ముఫాసా గౌరవం ఇచ్చే విధానం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంటుందని మహేశ్ అన్నారు. ఆ పాత్రకు వాయిస్ ఇవ్వడం డ్రీమ్ కమ్ ట్రూ గా భావిస్తానని మహేశ్ చెప్పారు. అలానే ఇందులో టాకా పాత్రకు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పారు. ఇక ఇందులోని మరో రెండు కీలక పాత్రలైన టిమోన్ కు అలీ, పుంబా కు బ్రహ్మానందం వాయిస్ ఇచ్చారు. తాము పోషించిన పాత్రలకు కాకుండా జంతువుల పాత్రలకు డబ్బింగ్ చెప్పడం ఓ కొత్త అనుభూతిని కలిగించిందని వారన్నారు.

Movie News: Baaghi-4: ‘బాఘీ -4’ ఎప్పుడంటే….

Baaghi-4: ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ 2016లో ‘బాఘీ’ చిత్రం ద్వారానే హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి భాగంలో సుధీర్ బాబు విలన్ గా నటించాడు. విశేషం ఏమంటే… ‘బాఘీ’ మూవీకి సీక్వెల్ ఆ తర్వాత రెండేళ్ళకు వచ్చింది. మళ్ళీ మరో రెండేళ్ళకు ‘బాఘీ -3’ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం ఐదేళ్ళ తర్వాత దీని నాలుగో భాగం రాబోతోంది. ‘బాఘీ -4’ సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఒకటి వచ్చింది. ఇందులో సంజయ్ దత్ విలన్ పాత్ర పోషించబోతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. సింహాసనం లాంటి కుర్చీలో కూర్చున్న సంజయ్ దత్ ఒడిలో చనిపోయిన ఓ అమ్మాయి ఉంది. పక్కన ‘ప్రతి ప్రేమికుడు ఒక ప్రతినాయకుడు’ అనే కాప్షన్ పెట్టారు. కన్నడ దర్శకుడు ఎ. హర్ష తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వచ్చ యేడాది సెప్టెంబర్ 5న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత సాజిద్ నడియాద్ వాలా ప్రకటించారు. సంజయ్ దత్ పోస్టర్ ను చూసిన చాలా మంది నెటిజన్స్ దీనిని ‘యానిమల్’తో పోల్చుతుంటే… మరికొందరు ఇది ‘యానిమల్’కు సీక్వెలా? అని కామెంట్ చేస్తున్నారు.

ALSO READ  Bellamkonda Sai Sreenivas: సినిమాలు మానేస్తానన్న బెల్లంకొండ: ఎందుకో తెలుసా?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *