Maharastra: తనకు నచ్చింది తనకు కావాల్సిందే.. అన్నట్టు కొందరు దుండగులు ప్రవర్తిస్తూ ఉంటారు.. ఇక్కడా అదే కోరుకున్నాడో కామాంధుడు.. ఓ మైనర్ బాలిక తనకు నచ్చిందని, తనను ప్రేమించాల్సిందేనని వెంటబడ్డాడు. ఆమె నిరాకరించింది. అయినా కత్తితో బెదిరించి వశం చేసుకోవాలనుకున్నాడు.. స్థానికుల చొరవతో ఆ యువకుడి నుంచి ఆ బాలికను తప్పించారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన సినీ ఫక్కీలో చోటుచేసుకున్నది.
Maharastra: మహారాష్ట్రలోని సతారాలో ఓ మైనర్ బాలిక 10వ తరగతి చదువుతున్నది. ఆమెను ప్రేమిస్తున్నానంటూ ఓ 18 ఏళ్ల యువకుడు కొన్నాళ్లుగా వెంటపడుతున్నాడు. ఆ బాలిక తిరస్కరించింది. అయినా వెంటపడుతూనే ఉన్నాడు. అయినా తనకు చదువే ముఖ్యం అనుకొని ఆ యువకుడిని తిరస్కరిస్తూనే ఉన్నది. ఎంత వద్దనుకున్నా.. ఆ దుండగుడు ఆ బాలికను ఎలాగైనా వశపర్చుకోవాలని భావించాడు.
Maharastra: ఆ బాలికను తన సొంతం చేసుకోవాలనే దుష్టపన్నాగం పన్నాడు. స్కూల్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఆ యువతి మెడపై కత్తి పెట్టి బెదిరించసాగాడు. స్థానికులు అడ్డుకోబోతే కత్తి తిప్పుతూ బెదిరించాడు. దాంతో ఎవరూ దగ్గరికి వెళ్లలేకపోయారు. ఈలోగా వెనుక వైపు నుంచి ఓ స్థానికుడు వచ్చి ఆ యువకుడిని గట్టిగా పట్టుకోవడంతో ఇతరులు ఆ యువతిని విడిపించారు.
Maharastra: ఈ సమయంలో ఆ యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. పోలీసులకు అప్పగించారు. దీంతో అప్పటివరకు ఆ దుండగుడి బారి నుంచి ఆ బాలికను విడిపించారు కానీ, మళ్లీ రాడనే గ్యారంటీని మాత్రం ఈ సమాజం ఇవ్వలేకపోతున్నది. మళ్లీ వస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని ఈ చట్టాలు చెప్పలేకపోతున్నాయి. ఇలాంటి దుండగులు ఇప్పట్లో బయటకు రాకుండా ఉండేలా సరైన శిక్షలు ఉండాలని పలువురు కోరుకుంటున్నారు.

