TTD Chairman: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా నియమితులైన బీఆర్ నాయుడుతో మహా న్యూస్ ఛైర్మన్ వంశీకృష్ణ భేటీ కానున్నారు . టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడును అభినందించడానికి మహా వంశీ ఈరోజు(నవంబర్12) కలవబోతున్నారు. ఈసందర్భంగా టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడు తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు మహా ఛైర్మన్ వంశీకృష్ణ. బీఆర్ నాయుడుకు అభినందనలు తెలపడంతో పాటు.. టీటీడీ ఛైర్మన్ గా ఆయన తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకునే భక్తుల కోసం ఏ విధమైన ఏర్పాట్లు చేయబోతున్నారు ? బీఆర్ నాయుడు తనదైన ప్రత్యేకశైలిని శ్రీవారి సన్నిధిలో ఇప్పటికే నిరూపించుకున్న నేపథ్యంలో భవిష్యత్ లో ఆయన తిరుమల పవిత్రతను కాపాడడం కోసం ఎలాంటి ప్రణాళికలు తీసుకురాబోతున్నారు వంటి అంశాలను మహా ఛైర్మన్ చర్చించే అవకాశం ఉంది .
ఈరోజు (నవంబర్ 12) సాయంత్రం 7 గంటలకు ఈ ఇద్దరి భేటీ పై ప్రత్యక్ష ప్రసారం మహాన్యూస్ లైవ్ లో చూడవచ్చు